న్యూ ఎయిర్ పోర్ట్‌లో పార్కింగ్ ఛార్జీల పెంపు
- March 21, 2018మస్కట్ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్ ధరల్ని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ విభాగం పెంచింది. తొలి అర్థ గంటకు 500 బైజాస్ చెల్లించాల్సి వుండగా, గంటకు 2 ఒమన్ రియాల్స్ చెల్లించాలి. ఓల్డ్ ఎయిర్ పోర్ట్‌లో పార్కింగ్ రుసుము తొలి గంటకు 500 బైజాస్ కాగా, ప్రతి 30 నిమిషాలకు మరో 500 బైజాస్ చెల్ల్లించాల్సి వచ్చేది. లాంగ్ టెర్మ పార్కింగ్ రుసుము కూడా రెండింతలకు పైగానే జరిగింది. తొలి రోజుకి 7 ఒమన్ రియాల్స్, రెండో రోజుకి 13 ఒమన్ రియాల్స్, మూడో రోజుకి 20 రియాల్స్ చెల్లించాలి. మూడో రోజు తర్వాత ప్రతి రోజుక 5 ఒమన్ రియాల్స్ చెల్లింపు తప్పనిసరి. గతంలో లాంగ్ టెర్మ్ పార్కిగ్ కోసం 3 ఒమన్ రియాల్స్ (ఒక రోజు), 4 ఒమన్ రియాల్స్ (రెండో రోజుకి), మూడో రోజుకి 5 ఒమన్ రియాల్స్, నాలుగో రోజుకి 6 ఒమన్ రియాల్స్, ఐదో రోజు తర్వాత 7 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సి వచ్చేది. కాగా, కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం 8000 కార్లకు పార్కింగ్ అకామడేట్ చేయగలదు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!