దుబాయ్ లో చోటుచేసుకున్న ఘటన
- March 21, 2018మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తనపై జరుగుతున్న అత్యాచార యత్నం నుంచి తప్పించుకునేందుకు ఓ యువ మోడల్.. ఆరో అంతస్తు నుంచి దూకేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాల పాలైంది. ఈ దుర్ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన మోడల్, ఓ కాంట్రాక్టు పని కోసం దుబాయ్‌లోని ఓ స్టార్ హోటల్‌లో బస చేసింది. అదే హోటల్‌లో దిగిన అమెరికా వ్యాపారవేత్త ఆమెపై కన్నేశాడు.
ఆమె గదికి వెళ్లి పరిచయం చేసుకుని.. ఆమెతో మాటా మాటా కలిపాడు. అలా ఆమెను మాటల్లో దించి.. మోడల్‌పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే తనపై జరుగుతున్న అత్యాచారం నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి ఆరో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఈ దుర్ఘటనలో ఆమె వెన్నెముకకు తీవ్రగాయమైంది.
ఆరో అంతస్తు నుంచి కిందకు పడిన ఆమెను వెంటనే హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించింది. దీంతో అమెరికాకు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతనిపై నేరం రుజువైతే 15 సంవత్సరాల వరకు జైలుశిక్ష తప్పదని వార్తలొస్తున్నాయి.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు