21 వ శతాబ్ధం ఇది
- April 13, 2018
నవీన నాగరికత పేరుతో మనిషి తన మేధస్సును వుపయోగించి మహీ మండలానికి, అంతరిక్షానికి మార్గాలు వేస్తున్న రోజులివి.
నాలుగు గదుల మధ్యలో కూర్చుని ఎక్కడో కోటాను కోట్ల కాంతి సంవత్సరాల ఆవల వున్న గ్రహమండలాన్ని గురించి ఆలోచన చేస్తున్నామే కాని మన చుట్టూ వున్నా సమాజం లో ఏమి జరుగుతోందో తెలుసుకోలేని స్థితి. ఒకవేళ తెలుసుకున్నా నేను, నా కుటుంబం అన్న చందాన సామాజిక అభ్యున్నతి కి అందనంత దూరం వెళ్తున్నాం. ఇది కొంతమందికి అవకాశమై, ఆలంబనగా మారి చెరిగిపోయిన రాజరిక వ్యవస్థను తిరిగి రూపు దిద్దేందుకు దోహద పడుతోంది.
ఎందుకు ఇంత చెప్పవలసి వస్తోంది అంటే మన ప్రారబ్ధ కర్మో ఏమో తెలీదు కానీ ఎంత మంది మేధో సంపన్నులు వున్నా, రాజనీతి లో అపర చాణుక్యు లు అనిపించుకున్నా కేవలం ఒక కుటుంబ చరణాలే తమకు ముక్తి పధాలు అన్నట్లు ప్రవర్తిస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా తెలుసుకోలేని స్థితి లో మనం ఉన్నాం.
దేశానికి స్వతంత్రం వచ్చి 67 సంవత్సారాలు దాటినా, ఇంకా అభివృద్ధి ఫలాలు సామాన్యులు అందుకోలేని దుస్థితి.
ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొని కూడా గత 4 దశాబ్దాలలో వేగం గా అభివృద్ధి చెందిన దేశాలను పొరబాటున ఎవరైనా గుర్తుకు తెస్తే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ఇక్కడ ఏ పని అంత తొందరగా పూర్తి కాదని మనకు మనం సమాధాన పరుచుకుంటాం. మరోప్రక్క మెరుగైన సంపాదన కోసం తిరిగి ఆ దేశాల ఆశ్రయం లో జీవితాన్ని గడిపేస్తూ వుంటాం అంతే తప్ప మన దేశ రాజ్యాంగం లో ప్రజలే ప్రభువులు అని, నాయకులు కేవలం ప్రజా సేవకులు తప్ప అనైతిక ప్రజా ప్రతినిధులు గా ఉండ రాదనీ మనకున్న చారిత్రక హక్కు ను వుపయోగించి సరైన, సమర్ధత కలిగిన నిస్వార్ధ నాయకుని ఎన్నుకోలేక చతికిల పడుతున్నాం. దీనికి మనం సిగ్గు పడాలో లేక ఆనంద పడాలో తెలుసుకోగలిగిన రోజు మన జీవితాలు, రానున్న తరాలు విప్లవాత్మక మార్పును సంతరించుకుంటాయి.
రండి ఇప్పటికైనా మేల్కోండి. మన జీవితం మన చేతుల్లో వుంది.
మేధావులూ! విజ్ఞాన సంపన్నులూ మౌనం వీడండి! జాతిని జాగృతం చేయండి. అవినీతి, వారసత్వ రాజకీయ చెదలు పట్టిన మన దేశ భవిష్యత్తును ను నిజాయితీ, ధర్మం అనే ఎరువును వేసి పైరు పచ్చని పంట పొలాల మాదిరి దేశాన్ని, మనలను వుద్ధరించుకుందాం.
అయిదేళ్ళ జీవితాన్ని ఒక నోటు కోసమో లేక, ఒక పూట మత్తు కోసమో పణం గా పెట్టద్దు. ఒకవేళ అలా ఎవరైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తే నిలదీయండి ఇంత సొమ్ము వారికెక్కడదని.
--సుబ్రహ్మణ్య శర్మ,దుబాయ్
తాజా వార్తలు
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!







