తెలుగు దర్శకుడికి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
తెలుగు దర్శకుడికి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం

తెలుగు దర్శకుడికి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం

ప్రముఖ దర్శకుడు టీఎల్‌వీ ప్రసాద్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం 'దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ - 2018' పురస్కారం అందజేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఈ అవార్డు అందుకున్నారు. టీఎల్‌వీ ప్రసాద్‌ ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాష్‌రావు కుమారుడు. దాదాపు 85 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో 40 హిందీ చిత్రాలున్నాయి. మిథున్‌ చక్రవర్తితోనే ఏకంగా 35 చిత్రాలు తెరకెక్కించారు. ఓ తెలుగు దర్శకుడుబాలీవుడ్‌లో ఇన్ని చిత్రాలకు దర్శకత్వం వహించడంతో ఆయనకు ఈ పురస్కారం దక్కింది.

తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకులతో చిత్రాల్ని తెరకెక్కించారు. బాలీవుడ్‌లో కొన్ని ధారావాహికలు కూడా నిర్మించారు. ప్రస్తుతం హిందీలో 'జై శ్రీకృష్ణ', 'జైజైజై భజరంగభళీ' సీరియల్స్‌ని తెరక్కిస్తున్నారు.