ఉరిశిక్ష రద్దుపై పిటిషన్.. కీలక పరిణామాలు
- April 24, 2018న్యూఢిల్లీ : ఉరి శిక్షకు ప్రత్యామ్నాయంపై సుప్రీం కోర్టులో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నేడు కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఉరి శిక్ష రద్దును చేసి.. ఇతర మార్గాల ద్వారా మరణ శిక్షను అమలుపరచాలని, ఈ మేరకు చట్టంలో సవరణ చేయాలని అడ్వొకేట్ రోషి మల్హోత్రా.. అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఉరి ముమ్మాటికీ వ్యక్తి స్వేచ్ఛా హక్కులను అగౌరవపరిచినట్లేనని ఆయన వాదనలు వినిపించారు.
దీంతో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించించి. దీనికి స్పందించిన కేంద్రం మంగళవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపటం, తుపాకులతో కాల్చి చంపటం కన్నా ఉరి శిక్ష చాలా సులువైన పద్ధతని.. సురక్షితంగా, త్వరగతిన అమలు చేసేందుకు వీలవుతుందని కౌంటర్ అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. దీనిని పరిశీలనకు స్వీకరించిన తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు