తేనె, ఎండు ఖర్జూరాల మిశ్రమం.. కొవ్వుని కరిగించే ఆయుధం

- April 27, 2018 , by Maagulf
తేనె, ఎండు ఖర్జూరాల మిశ్రమం.. కొవ్వుని కరిగించే ఆయుధం

తేనె శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉండడం వలన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అలాగే ఎండు ఖర్జూరాల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. మరి ఈ రెండు కలిపి తింటే శరీరానికి మరింత ఉపయోగం. ఓ వారం రోజుల పాటు తేనెలో నానబెట్టిన ఎండు ఖర్జూరాలు ఉంచి రోజుకో మూడు తింటే దాని వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..

ఓ గాజు సీసాలో సగానికి పైగా తేనెను తీసుకోవాలి. అందులో విత్తనాలు తీసిన ఎండు ఖర్జూరాలను వేయాలి. తరువాత మూత గట్టిగా బిగించి తేనె, ఖర్జూరాలు బాగా కలిసేలా షేక్ చేయాలి. వారం రోజులు పక్కన ఉంచాలి. మధ్య మధ్యలో షేక్ చేస్తుంటే బాగా నానే అవకాశం ఉంటుంది. వారం తరువాత రోజుకి రెండు లేదా మూడు ఖర్జూరాలు తింటే మంచిది. 

1. ఇలా తినడం వలన దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు దూరమవుతాయి. తరుచుగా వేధించే ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. 
2.నిద్ర లేమితో బాధ పడే వారికి మంచి మందు. ఒత్తిడి, ఆందోళన కూడా దూరమవుతుంది. శరీరంపై ఏవైనా గాయాలుంటే త్వరగా మానుతాయి. 
3. చిన్నారులు రోజూ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరిగి చదివినది బాగా గుర్తుంటుంది. మహిళలకు కావలసిన కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. రక్త హీనతను నివారించి ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి. 
4.సీజనల్ వ్యాధులను, అలర్జీలను నివారిస్తుంది. పలు రకాల క్యాన్సర్‌ కారకాలను దరిచేరనీయకుండా ఈ మిశ్రమం పనిచేస్తుంది. 
5.జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. పేగుల్లోని చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. 
6.రక్త హీనత ఉన్నవారికి మేలు చేస్తుంది. బీపీ, గుండె సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది. శరీరంలో అధికంగా పేరుకున్న కొవ్వుని తొలగించి శరీర బరువుని తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com