సివిల్స్ టాపర్ సిరిసిల్ల వాసి...
- April 27, 2018
తెలంగాణ:సివిల్ సర్వీస్ పరీక్ష -2017 తుది ఫలితాలను యూపీఎస్సీ ఈ సాయంత్రం విడుదల చేసింది. గతేడాది అక్టోబర్- నవంబర్ మధ్య నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పోయినేడాది అక్టోబర్ 28న యూపీఎస్సీ మెయిన్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య మౌఖిక పరీక్షలు నిర్వహించి మొత్తం 990 మంది పేర్లను ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌తో పాటు గ్రూప్-ఎ, గ్రూప్-బి ఉద్యోగాలకు యూపీఎస్సీ ఎంపికచేసింది. ఈ పరీక్ష ఫలితాలను అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని యూపీఎస్సీ వెల్లడించింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయన కుమారుడు సాయి ప్రణీత్ కూడా సివిల్స్ ర్యాంక్ సాదించిన వారిలో ఉన్నారు.
సివిల్స్‌లో తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్ మొదటి ర్యాంక్ సాధించాడు. అనుదీప్ జగిత్యాల జిల్లా మెట్‌పల్లివాసి. ఇక అనుకుమారి రెండో ర్యాంక్ సాధించగా.. సచిన్ గుప్తా మూడో ర్యాంకు సాధించాడు. ఈ సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ర్టాల నుంచి పలువురు అభ్యర్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. నీలం సాయితేజ 43వ ర్యాంక్, నారపురెడ్డి మౌర్య 100వ ర్యాంక్, జి. మాధురి 144వ ర్యాంక్, వివేక్ జాన్సన్ 195 ర్యాంకు సాధించారు. సాయి ప్రణీత్‌కు 196వ ర్యాంక్ వచ్చింది. అక్షయ్ కుమార్ 654వ ర్యాంక్, భార్గవ శేఖర్ 816వ ర్యాంకు సాధించారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా