ప్రపంచకప్‌లో భారత్‌ షెడ్యూల్‌ విడుదల...

- April 27, 2018 , by Maagulf
ప్రపంచకప్‌లో భారత్‌ షెడ్యూల్‌ విడుదల...

వచ్చే సంవత్సరం ఇంగ్లండ్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ షెడ్యూల్‌ విడుదలైంది. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే మొత్తం పది జట్లు.. మిగతా తొమ్మిది జట్లతో ఒక్కోసారి తలపడతాయి. భారత జట్టు ఈ 9 మ్యాచ్‌ల్ని ఆరు వేదికల్లో ఆడనుంది. 2019 వరల్డ్‌కప్ మే 30 నుంచి జులై 14 వరకు జరగనుంది. 2019, జూన్‌ 4వ తేదీన భారత్‌ తన తొలి మ్యాచ్ ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జూన్‌ 16న తలపడనుంది. 1992 ప్రపంచకప్‌ మాదిరి.. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో 2019 ప్రపంచకప్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. దీనిప్రకారం అన్ని జట్లు అందరితో ఆడతాయి.

India's schedule:

Match 1: India vs South Africa, June 5 - Hampshire Bowl, Southampton

Match 2: India vs Australia, June 9 - Oval, London

Match 3: India vs New Zealand, June 13 - Trent Bridge, Nottingham

Match 4: India vs Pakistan, June 16 - Old Trafford, Manchester

Match 5: India vs Afghanistan, June 22 - Hampshire Bowl, Southampton

Match 6: India vs West Indies, June 27 - Old Trafford, Manchester

Match 7: India vs England, June 30 - Edgbaston, Birmingham

Match 8: India vs Bangladesh, July 2 - Edgbaston, Birmingham

Match 9: India vs Sri Lanka, July 6 - Headingley, Leeds

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com