Job Mela on 30 April
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
నిరుద్యోగులకు ఈ 30న జాబ్‌మేళా

నిరుద్యోగులకు ఈ 30న జాబ్‌మేళా

హైదరాబాద్: సామ రంగారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న నగరంలోని వనస్థలిపురం పనామా చౌరస్తాలో గల బొమ్మిడి లలితా గార్డెన్స్‌లో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ సామ రంగారెడ్డి తెలిపారు. ఏడు, పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), బీఫార్మా, ఎంఫార్మా, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, ఎంఎల్‌టీ, బీపీటీ చేసిన వారితో పాటు చదువులేని వారికి సైతం ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతాయని పేర్కొన్నారు. జాబ్‌మేళాలో ఐసీఐసీఐ బ్యాంకు, ఏఆర్‌కే టెక్నాలజీస్, సన్‌లైన్ బిజినెస్ సొల్యూషన్స్, ధ్రువ్ కన్సల్టింగ్, క్యాంపస్ మార్గ్, హెడీబీ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, శుభగృహ, ఆవాస కన్సల్టింగ్, టెక్ మహీంద్ర, కొటక్ మహీంద్ర, కార్వీఫోర్డ్ తదితర సంస్థలు పాల్గొని అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.