కొరడా విసిరిన కిరణ్ బేడీ..

- April 28, 2018 , by Maagulf
కొరడా విసిరిన కిరణ్ బేడీ..

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సంచలన ప్రకటన చేశారు. 2018 మే 31 లోగా పుదుచ్చేరిలోని అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత (ఒడిఎఫ్) గ్రామాలుగా గుర్తింపు పొందాలని. లేని యెడల ఉచిత బియ్యం పథకాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు. పరిశుభ్రంగా లేని గ్రామాలకు ప్రభుత్వ పథకాలు అందుకునే అర్హత లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

తమ గ్రామం ఒడిఎఫ్ గ్రామమని .పుదుచ్చేరిలో ప్రతి గ్రామం సంబంధిత నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేతోను, సివిల్ సప్లయ్ అధికారికి అనుబంధంగా ఉండే అధికారి ద్వారా పొందిన సర్టిఫికేట్లను సమర్పించాల్సి ..అప్పుడే ఆ గ్రామానికి ఉచిత బియ్యం పథకం వర్తిస్తుందని ఆమె తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నత్త నడకన జరుగుతుండడంతో ఆగ్రహంతో ఉన్న కిరణ్ బేడీ ఈ సంచలన ప్రకటన చేశారు. స్థానిక నాయకులు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ ఒక నిర్ణీత గడువులోగా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే తపన లేకపోవడాన్ని కిరణ్ బేడీ గమనించారు. అందుకే గ్రామాలను హెచ్చరించారు.

కిరణ్ బేడీ చేసిన వ్యాఖ్యలను అన్నాడిఎంకె నేతలు తప్పుబట్టారు. గ్రామీణ ప్రజలను హెచ్చరించడం వంటి పనులు గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి చేయదగిన పనికాదని అన్నాడిఎంకె నేతలు అంటున్నారు.

గ్రామాల్లో పరిసరాలు శుభ్రంగా ఉండేలా చేసే బాధ్యత అధికారులదని.వారిని శిక్షించాల్సింది పోయి పేదలపై ప్రతాపం చూపడం న్యాయం కాదని అన్నాడిఎంకె కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. కిరణ్ బేడీ చేసిన పనికి ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com