భూకంపం అనుకున్నారు.. కానీ..?
- April 30, 2018
నిన్న రాత్రి పది, పదకొండు సమయంలో టర్కీ, లెబనాన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.6గా నమోదైంది.. ఇంట్లోని సామానులు, ఫర్నిచర్‌లో కదలికలు రావడంతో.. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలోంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన భూకంప పరిశోధన కేంద్రం.. భూకంప కేంద్రాన్ని గుర్తించేపనిలో పడగా అసలు నిజం తెలిసింది. ఇది ప్రకృతిపరంగా సంభవించిన భూకంపం కాదని తేలింది. సరిగ్గా ఇదే సమయంలో ఇజ్రాయిల్ సైన్యం సిరియాపై భీకర వైమానిక దాడులు చేసింది. దక్షిణ హమాలోని 47వ మిలిటరీ బ్రిగేడ్ కాంపౌండ్ పై అత్యంత శక్తివంతమైన క్షిపణులతో దాడి చేయడంతో.. తీవ్రస్థాయిలో ప్రకంపనలు సంభవించాయి.. దీని ప్రభావంతో సిరియా సరిహద్దున ఉన్న టర్కీ, లెబనాన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా