సింగపూర్ లో తెలుగు సమాజం మేడే వేడుకలు...
- May 02, 2018_1525278475.jpg)
సింగపూర్:"శ్రమిద్దాం...శ్రమను గుర్తిద్దాం...శ్రమను గౌరవిద్దాం" అనే నినాదం తో సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మికదినోత్సవ వేడుకలను మే 1, మంగళవారం నాడు స్థానిక క్రాంజి రెక్రియేషన్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 800 మంది స్థానిక తెలుగు కార్మికసోదరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వందేమాతరం శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొని , తన సాహితీ ప్రస్థానంలో స్వరపరిచిన, గానం చేసిన అనేక వైవిధ్య మరియు ఉత్తేజభరితమైన పాటలతో ఆహుతులను ఉర్రూతలూగించారు. సింగపూర్ తెలుగువారి కోసం వారు ఒకపాటను రచించి, స్వరపరచి ఆలపించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సమాజం మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమం కి తను ముఖ్య అతిధిగా హాజరు కావటంపట్ల హర్షంవ్యక్తపరిచారు. ఈ వేడుకల సంధర్భంగా సమాజం వారు కార్మికసోదరులకు నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులను , ప్రశంసాపత్రాలను అందించారు.
సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ,సింగపూర్ తెలుగు సమాజం తెలుగు కార్మిక సోదరులకి ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అండ గా ఉంటామని,తెలుగు వారందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు వారికి మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఉపాధ్యక్షుడు జ్యోతీశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించిన కార్యవర్గసభ్యులకీ మరియు దాతలకు కార్యదర్శి సత్య చిర్ల ప్రత్యేక దన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







