100 అడుగుల ఎత్తులో ఆగిపోయిన రోలర్ కోస్టర్
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
100 అడుగుల ఎత్తులో ఆగిపోయిన రోలర్ కోస్టర్

100 అడుగుల ఎత్తులో ఆగిపోయిన రోలర్ కోస్టర్

పశ్చిమ జపాన్‌లోని యూనివర్శల్ స్టూడియోస్ ఎమ్యూజ్‌మెంట్ పార్కులో ఒక రోలర్ కోస్టర్ ఉన్నట్టుండి ఆగిపోయింది. దీనితో రోలర్ కోస్టర్‌లో విహరిస్తున్న సుమారు 64 మంది 2 గంటలపాటు వేలాడుతూ ఉండిపోయారు. ఎమర్జెన్సీ స్టాప్ కారణంగా ఆగిపోవటంతో 100 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. పార్కు సిబ్బంది ఎమర్జెన్సీ మార్గంలో బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 1120 మీటర్ల పొడవైన ఈ రోలర్ కోస్టర్‌ను 2016 మార్చిలో ప్రారంభించారు.