వీలైనంత త్వరగా నిరుద్యోగ భృతి అమలు: మంత్రి కొల్లు

- May 03, 2018 , by Maagulf
వీలైనంత త్వరగా నిరుద్యోగ భృతి అమలు: మంత్రి కొల్లు

అమరావతి: నిరుద్యోగ భృతిని వీలైనంత త్వరలు అమలు చేయాలని సీఎం యోచిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం నిరుద్యోగ భృతిపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. అనంతరం మంత్రి కొల్లురవీంద్ర మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ భృతిపై విధివిధానాలు కసరత్తు చేస్తున్నామని, కనీసం 10 లక్షల మందికి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు.వయోపరిమితి, విద్యార్హత ఎలా ఉండాలనే దానిపై చర్చిస్తున్నామని మంత్రి చెప్పారు. కేవలం భృతి ఇవ్వడమే కాకుండా యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. దీని పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్ కేటాయింపులతో పాటు ఇతర శాఖల నిధులు కూడా తీసుకుంటామన్న మంత్రి కొల్లు రవీంద్ర ఇతర రాష్ట్రాల మాదిరిగా పథకం ఫెయిల్ కాకుండా చూస్తున్నామని చెప్పుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com