'జంబలకిడి పంబ' టీజర్ విడుదల
- May 03, 20181993లో ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన జంబలకిడి పంబ చిత్రం సినీ లవర్స్ పొట్ట చెక్కలయ్యేలా ఎంతగా నవ్వించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడాళ్ళు మగాళ్ళుగా మారి ఆదిపత్యం చలాయించడం, మగాళ్ళు ఆడాళ్ళుగా మారి వంటింటికి పరిమితం కావడం వంటి సన్నివేశాలు సిల్వర్ స్క్రీన్‌పై పసందైన విందు అందించాయి. అయితే జంబలకిడి పంబ టైటిల్‌తో మరో చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించనుంది. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాలలో సోలో హీరోగా నటించిన శ్రీనివాస రెడ్డి ప్రధానపాత్రలో మరో జంబలకిడి పంబ తెరకెక్కుతుంది. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం జంబలకిడి పంబ. ఈ మూవీ రొమాంటిక్ కామెడీగా ఉంటుందని తెలుస్తుంది. గోపి సుందర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్, ఈస్ట్ గోదావరి, అరకు, వైజాగ్, కేరళ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదల చేశారు. ఇందులో పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డికి సంబంధించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ముంబై మోడల్ సిద్ధి ఇద్నానీ ఈ చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అవుతుంది. టీజర్ చూసి మీరు ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్‌ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!