హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం
- May 03, 2018హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నాగోల్, మోహన్ నగర్ , కొత్తపేట్ , చైతన్య పురి , దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్, పాతబస్తీ, అశోక్ నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, బషీర్ బాగ్, బహదూర్ పురా, యాకుత్ పురా, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, సైదాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. ఈదురు గాలులతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. విద్యానగర్ శివమ్ రోడ్ లో చెట్లు విరిగి రోడ్డుపై పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు