కూతురి వివాహానికి హాజరుకాలేకపోతున్న తండ్రి..మేఘన్ మనస్తాపం
- May 16, 2018లాస్ ఏంజెల్స్ : బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్‌ల పెళ్లి వేడుకకు మేఘన్ తండ్రి థామస్ మార్కెల్ హాజరుకావడం లేదని ఒక వెబ్సైట్ పేర్కొంది. గత వారం గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన మేఘన్ తండ్రి థామస్‌ను ప్రస్తుతం డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. 74 ఏళ్ల థామస్‌కు బుధవారం హార్ట్ సర్జరీ జరగనున్న నేపథ్యంలో ఆస్పత్రి నుంచి కదలకూడదని వైద్యులు చెప్పడంతో కూతురు పెళ్లికి హాజరుకాలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన మెక్సికోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లికి హాజరుకాలేకపోతున్నట్లు వెబ్సైట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్