యుగాల వాస్తవంగా...!!

- December 07, 2015 , by Maagulf

నేస్తం,
భావాలకు పాతదనం లేదని ఎప్పటికి కొత్తగానే ఉంటాయని ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నా ఎందుకో మళ్ళి కొత్తగానే అనిపిస్తోంది... ఎప్పటిదో జ్ఞాపకం ఇప్పటికి పలకరిస్తూనే ఉంది నన్ను... నీతో చేరినందుకేమో ఆ జ్ఞాపకానికంత జీవకళ ఇప్పటికి... నన్ను వదలలేని నీ జ్ఞాపకాలన్నీ నాతోనే ఉండి పోయాయి నీకు లేకుండా... అందుకేనేమో జ్ఞాపకాన్ని మర్చిపోయావు గతానికి వదిలేస్తూ... మాటలు మర్చిపోయిన గతాన్ని జ్ఞాపకాల వాస్తవంలో చూడాలని నీకెప్పుడు అనిపించలేదా... క్షణాల కాలంలో యుగాల నిరీక్షణలా ఎదురుచూస్తూనే ఉండి పోయింది నా జ్ఞాపకం నీ ఎద వాకిలిలో రెప్పల మాటున దాగుండి పోయి... నా చుట్టూ ఉన్న జ్ఞాపకాల పహారాలో సేద దీరిన మది తలపులు తెరచి చూస్తే ... హద్దులు లేని ఆకాశంలో లెక్కకు రాని వేల చుక్కల్లో రాలిపడిన ఒంటరి నక్షత్రాల లెక్క తేలనట్లే ఈ జ్ఞాపకాల లెక్కలు తేలడంలేదు ఎన్ని సార్లు లెక్కించినా... లెక్కలు తేలడం లేదని కోపం నటిస్తున్నాయి జ్ఞాపకాలు... తేలని లెక్కల్లో ఎప్పుడు నీతోనే ఉండొచ్చని తెలిసి కూడా ... జాలి లేని కాలం గతాన్ని వెనుకకు నెట్టేసి నువ్వు లేని వాస్తవాన్ని నాకు దగ్గరగా తేవాలని తహ తహలాడుతోంది... కాలానికి అర్ధం కావడం లేదు.. నువ్వు లేని వాస్తవాన్ని నేనెప్పుడో త్యజించానని... గతమైన జ్ఞాపకమే నా నేస్తం ఎప్పటికీ అని... అక్షరాలకు తెలిసింది కాని నాతోనే ఉన్న నీకు తెలియడం లేదు... నీ గతంలోని వాస్తవాన్ని నేనే అని... ఇప్పటికయినా తెలిసిందా నేస్తం ఎవరికెవరో... క్షణాల నీ జ్ఞాపకంగా మారడానికి యుగాల వాస్తవంగా వేచి ఉండటానికి సిద్దం....!!
ఎప్పటికి నీకు లేని జ్ఞాపకం...

--మంజు యనమండ్ల 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com