పోలీసుల అదుపులో వ్యభిచారం నిర్వహిస్తున్న తమిళ నటి
- June 03, 2018చెన్నై: వ్యభిచారగృహాన్నినిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ప్రముఖ తమిళ సినీనటి సంగీత బాలన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని పనయూర్ ప్రాంతంలోగల ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో సంగీత బాలన్ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు.. రిసార్ట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది విటులు 'సహా పలువురు మహిళలను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. మహిళలంతా ఉత్తర భారతానికి చెందిన వారిగా గుర్తించి.. వారిని వ్యభిచారం గృహం నుంచి పునరావాస కేంద్రానికి తరలించారు. వ్యభిచారగృహ నిర్వహణలో సంగీతకు సహకరిస్తున్న సురేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిని మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టగా.. ధర్మాసనం ఇద్దరికి కస్టడీ విధించింది. సంగీత బాలన్ 1996లో వచ్చిన కరప్పురోజా సినిమాతో తమిళనాట తెరంగేట్రం చేసింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటించింది.
వీటితోపాటు తమిళనాట మోస్ట్ పాపులర్ టీవీ సీరియల్‌గా రన్ అవుతున్న రాణీ-వాణీలో రాధికా శరత్ కుమార్‌తో కలిసి నటిస్తోంది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ