అబుదాబీలో రేస్-3 షూటింగ్: హీరోయిన్ జాక్వెలైన్ కంటికి గాయం
- June 12, 2018బాలీవుడ్ బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఓ సినిమా షూటింగ్లో గాయపడింది. శ్రీలంకకి చెందిన జాక్వెలైన్ ఫెర్నాండెజ్, బాలీవుడ్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెల్సిందే. ఈ భామ 'రేస్-3' సినిమా షూటింగ్ కోసం అబుదాబీలో చక్కర్లు కొట్టింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె కంటికి గాయమయ్యింది. చిన్న గాయం కాదిది. ఈ గాయం కారణంగా ఆమె కంటి ఐరిస్ రూపం కోల్పోయింది. ఇది పర్మనెంట్ గాయమనీ, అయినాసరే, 'రేస్-3' సినిమాకి సంబంధించి ఇది ఒక గొప్ప మెమరీగా గుర్తుండిపోతుందని జాక్వెలైన్ వెల్లడించింది. 'రేస్-3' సినిమాని యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రెమో డిసౌజా డైరెక్టర్. సల్మాన్‌ఖాన్‌తో జాక్వెలైన్కి ఇది రెండో సినిమా.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు