తిన్నది అరగటానికి గ్యాస్ సమస్య కి చిట్కాలు....
- June 21, 2018అధిక మొత్తంగా ఆహారం తీసుకోవడం, అజీర్ణం, తిన్న ఆహారం తేలికగా జీర్ణ కాకపోవడం వల్ల కడుపులో నొప్పి మరియు గ్యాస్ ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మన ఇంట్లోనే కొన్ని రకాల పదార్థాలతో ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
1. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనా రసం, ఒక స్పూన్ అల్లం రసం తీసుకుని దీనికి కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యను నివారించుకోవచ్చు.
2. ఇంగువ, యాలుకలు, శొంఠి, సైంధవ లవణం సమానంగా తీసుకుని మెత్తగా పొడిలా చేసుకుని ఉదయం, సాయంత్రం అరస్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవడంతో పాటు కడపులోని గ్యాసు, కడుపు ఉబ్బరం తగ్గి శరీరం తేలికగా ఉంటుంది.
3. కడుపులో ఏర్పడే నొప్పిని తగ్గించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పని చేస్తుంది. బేకింగ్ సోడా ఆంటాసిడ్ గుణాలను కలిగి ఉంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు వేడినీటిలో కలుపుకుని తాగడం వలన ఉదర భాగంలో ఏర్పడే నొప్పి త్వరగా తగ్గిపోతుంది.
4. బొప్పాయిని చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసి రోజూ అరస్పూన్ పొడిని తగినంత తేనె కలిపి తీసుకుంటే కడుపునొప్పి, మలబద్దకం, అజీర్తి, వికారం, ఆకలి లేకపోవడం లాంటి ఉదర సంబందిత వికారాలు తగ్గిపోతాయి.
5. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు.
6. పంచదార మరియు జీలకర్రను నమిలి తిన్నా మంచి ఫలితం ఉంటుంది. తులసీ మరియు పుదీనా ఆకులను కలిపి నమిలినట్లయితే ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి. వీటితో పాటు చల్లటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడిని వేసి తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం, నొప్పి తగ్గుముఖం పడతాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు