ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- May 16, 2024
అమరావతి: ఏపీలో తీవ్ర వివాదాస్పదమైన, రాజకీయాల్లో పెను దుమారం రేపిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీనిపై ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ.. ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెడుతు.. ఈ చట్టం ప్రయోజనాలు భేష్ అంటూ కితాబు ఇచ్చింది నీతి ఆయోగ్. ఈ చట్టంతో భూమిపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని నీతి ఆయోగ్ తెలిపింది. రైతుల భూములు లాక్కునే పరిస్థితి అస్సలే ఉండదని క్లారిటీ ఇచ్చింది.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే భూ పరిపాలన మరింతగా సులువు అవుతుందని తెలిపింది. పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం అని నీతి ఆయోగ్ ప్రకటించింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రం అని తేల్చి చెప్పింది. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్ పెట్టినట్లు అయ్యింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. ఆర్టీఐ ద్వారా వెంకటేశ్ వేసిన అప్లికేషన్ మేరకు నీతి ఆయోగ్ ఈ సమాచారం వెల్లడించింది. ఈ చట్టంతో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని, భూములన్నీ మరింత భద్రంగా ఉంటాయని, భూములపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఏపీలో ఎన్నికల సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి.
అయితే, ఏపీలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా ఉంది? నీతి ఆయోగ్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం వ్యహరిస్తోందా? అన్న అంశానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు అంటూ ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ వేశారు. ఈ చట్టంతో రైతులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పాలని నీతి ఆయోగ్ ను అడిగారు. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్.. కచ్చితంగా వారి భూ హక్కులు మరింత భద్రంగా ఉంటాయన్న సమాధానాన్ని నీతి ఆయోగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







