వంకాయ ఆకుల రసంలో తేనెను కలుపుకుని తీసుకుంటే...
- August 18, 2018వంకాయలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వంకాయను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. షుగర్ వ్యాధులతో బాధపడేవారికి ఎంతో సహాయపడుతుంది.
వంకాయ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ కె శరీరంలో బ్లడ్ క్లాట్స్‌ను ఏర్పడకుండా నిరోధిస్తుంది. వంకాయలో క్యాలరీలు తక్కువగానే ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి వంకాయను డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. జీవక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది.
శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు సమస్యలను తగ్గిస్తుంది. నరాల వ్యాధుల నుండి కాపాడుతుంది. ఆకలిని పెంచుటలో వంకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. వంకాయ ఆకుల రసంలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు మూడుసార్లు తీసుకుంటే దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు తొలగిపోతాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం