జీవా, షాలిని పాండే 'గొరిల్లా' టీజర్ విడుదల
- September 16, 2018అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన అందాల భామ షాలిని పాండే. ఈ చిత్రంలో ముద్దుగుమ్మ నటనకి టాలీవుడే కాదు కోలీవుడ్ కూడా ఫిదా అయింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండేకి తమిళంలో రెండు ఆఫర్లు వచ్చాయి. జీవీ ప్రకాశ్ హీరోగా నటిస్తున్న '100% కాదల్' చిత్రంలో నటిస్తున్న షాలిని , మరో వైపు జీవా హీరోగా చేస్తున్న 'గొరిల్లా'లోను కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, త్వరలోనే విడుదలకి సిద్ధమవుతున్నాయి. '100% కాదల్' చిత్రం తెలుగులో వచ్చిన 100% లవ్ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ' గొరిల్లా చిత్రంలో నిజమైన చింపాజీ నటిస్తుండగా, దీనితో చిత్ర హీరో, హీరోయిన్స్ స్నేహం చేస్తున్నారట. థాయ్‌లాండ్ భాషలో కొన్ని పదాలు కూడా నేర్చుకున్నారట. చింపాంజితో కలిసి నటించేందుకు ప్రారంభంలో కాస్త భయపడినా తర్వాత ఎలాంటి బెరుకూ లేకుండా నటించేసిందట షాలిని. డాన్ సాండీ దర్శకత్వంలో గొరిల్లా అనే చిత్రం తెరకెక్కుతుంది. యోగి బాబు, సతీష్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. మీరు టీజర్‌పై ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!