విదేశాల్లో "ఎఫ్-2" షూటింగ్ పూర్తి
- September 17, 2018అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎఫ్ 2'. ఫన్ అండ్ ఫ్ట్రస్టేషన్ అనేది ఈ సినిమాకు ఉప శీర్షిక. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మెహ్రీన్, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరవేగంగా 'ఎఫ్-2' చిత్రీకరణ జరుగుతోంది. కథ ప్రకారం ఈ సినిమా షూటింగు కొంతకాలంగా విదేశాల్లో జరుగుతోంది.
కొన్ని రోజులుగా 'ప్రగ్వే'లో జరుగుతోన్న షెడ్యూల్ ఇప్పుడు పూర్తయ్యింది. అనిల్ రావిపూడి లొకేషన్లో సరదాగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని తెలిపారు. వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమాలో, రాజేంద్రప్రసాద్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందిస్తున్నారు. హ్యాట్రిక్ హిట్ తరువాత అనిల్ రావిపూడి చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే అందరిలోను అంచనాలు వున్నాయి. వెంకటేష్ వంటి సీనియర్, వరుణ్ తేజ్ వంటి జూనియర్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ఇది క్రేజీ కాంబోగా నిలుస్తోంది.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్‌ను కలిసిన భారత రాయబారి
- ఖతార్‌లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష