రూ.1378 కోట్లకు అమ్ముడుపోయిన 'టైమ్' మ్యాగజైన్
- September 17, 2018
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక టైమ్ మ్యాగజైన్‌ను అమ్మేశారు. మెరెడిత్ కార్పొరేషన్‌కు చెందిన ఈ మ్యాగజైన్‌ను 190 మిలియన్ డాలర్లుకు (భారత కరెన్సీలో దాదాపు రూ.1378.92కోట్లు) విక్రయించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ప్రముఖ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ సేల్స్‌ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ బెనియాఫ్ దంపతులు టైమ్ మ్యాగజైన్ కొనుగోలు చేశారు. అయితే మార్క్ బెనియాఫ్ దీన్ని వ్యక్తిగతంగా కొనుగోలు చేశారని, సేల్స్‌ఫోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని మెరిడెత్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక మ్యాగజైన్ రోజువారి కార్యకలాపాల్లో బెనియాఫ్ ఎలాంటి జోక్యం చేసుకోబోరని, ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్ బృందమే నిర్ణయాలు తీసుకుంటుందని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







