శేఖర్ కమ్ముల దర్శకుడిగా నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న ఏషియన్ గ్రూప్
- September 17, 2018
యాభై సంవత్సరాలుగా 600ల సినిమాలకు ఫైనాన్స్ అందించి ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాలలో అగ్రగామి సంస్థగా ఎదిగిన ఏషియన్ గ్రూప్ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. ప్రెస్టీజియస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోరూపొందే ఈ లవ్ స్టోరి కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
మల్టీప్లెక్స్ రంగంలో ఒక రివల్యూషన్ సృష్టించిన ఏషియన్ గ్రూప్ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధాన భాగంగా ఎదిగింది. సినిమాను ప్రేక్షకులకు చేరువచేసే డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాలలో అగ్రగామిగా ఎదిగిన ఏషియన్ గ్రూప్ ఇప్పుడు నిర్మాణ రంగంలో ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ ప్రయాణంలో తొలి అడుగు శేఖర్ కమ్ములతో కలసి వేస్తుంది. నిర్మాతలుగా నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు(FDC Chairman) వ్యవహారించ నున్నారు.
బ్లాక్ బస్టర్ మూవీ ఫిదా తర్వాత శేఖర్ కమ్మల చేయబోయే ప్రాజెక్ట్ మీద ఇండ్రస్టీలోనూ, ప్రేక్షకులోనూ ఆసక్తి నెలకొంది. కంటెంట్ ని తప్ప క్రేజ్ ని నమ్ముకోని శేఖర్ కమ్ముల నుండి రాబోతున్న ఈ లవ్ స్టోరీ కి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనుంది నిర్మాణ సంస్థ. amigos creations సమర్పణలో నిర్మించబోయే ఈ ప్రేమ కథకు నిర్మాతలుః నారాయణ దాస్ నారంగ్ , పి. రామ్మోహన్(FDC Chairman). కో ప్రొడ్యూసర్-విజయ్ భాస్కర్.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







