స్మగ్లర్ని పట్టుకున్న అండర్ కవర్ ఏజెంట్
- October 11, 201820కిలోల డ్రగ్స్‌ని స్మగుల్ చేస్తున్న వ్యక్తిని అండర్ కవర్ ఏజెంట్ చాకచక్యంగా పట్టుకోగలిగారు. నిందితుడ్ని అబుదాబీ క్రిమినల్ కోర్టులో హాజరు పరచడం జరిగింది. ఎమిరేటీ వ్యక్తి ఈ కేసులో నిందితుడు. పక్కా సమాచారంతో నిందితుడిపై నిఘా పెట్టారు అధికారులు. అండర్ కవర్ ఏజెంట్, డ్రగ్స్ డీలర్‌ని ఫోన్ ద్వారా సంప్రదించగా, 20 కిలోల హాషిష్‌ని విక్రయించేందుకు సదరు డీలర్ అంగీకరించాడు. ఈ అగ్రిమెంట్లో భాగంగా మీటింగ్ ప్లేస్ నిర్ణయం కూడా జరిగింది. 20 కిలోలకు బదులుగా డీలర్, 19 కిలోల హాషిష్ ఇవ్వడానికి ఆ తర్వాత అంగీకరించడం జరిగింది. అత్యంత వ్యూహాత్మకంగా వలపన్నిన అధికారులు, అండర్ కవర్ ఏజెంట్ ద్వారా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టి, అతని ఇంటి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 29కి ఈ కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్