వల్లభాయ్‌ పటేల్‌ భారీ విగ్రహం ఆవిష్కరణకు ఆహ్వానం

- October 17, 2018 , by Maagulf
వల్లభాయ్‌ పటేల్‌ భారీ విగ్రహం ఆవిష్కరణకు ఆహ్వానం

బెంగళూరు: దేశ ఐక్యత కోసం ఎంతగానో ప రితపించిన ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఏక్తా విగ్రహాన్ని ఈనెల 31న జాతికి అంకితం చేయనున్నారు. ఈ విషయాన్ని గు జరాత్‌ విద్యుత్‌శాఖ మంత్రి సౌరభ్‌భాయ్‌ పటేల్‌ బెంగళూరులో మీడియాకు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరిస్తారన్నారు. గుజరాత్‌లోని న ర్మదా జిల్లా సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ వద్ద 182 అడుగుల ఎత్తు కల్గిన ఈ భారీ విగ్రహాన్ని రోజూ 15వేలమంది పర్యాటకులు తిలకించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఈప్రాంతం అతి త్వరలోనే ప్రాధాన్యతను సంతరించుకోవడం ఖాయమన్నారు. పటేల్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను ఆహ్వానిస్తున్నామన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం కోసం పాటుపడిన ఉక్కుమనిషి పటేల్‌ను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని అయితే ప్రధాని మోదీ సాహసోపేతంగా విమర్శలకు సైతం వెరవకుండా ఏక్తా విగ్రహాన్ని గట్టి పట్టుతో పూర్తి చేశారన్నారు. దేశ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. రూ.3వేల కోట్ల ఖర్చుతో జాతీయ ఏక్తా ట్రస్టు ఈ విగ్రహాన్ని నిర్మించిందన్నారు. గుజరాత్‌కే చెందిన కర్ణాటక గవర్నర్‌ వాజుభాయ్‌వాలాను, ముఖ్యమంత్రి కుమారస్వామిని, మాజీ ప్రధాని దేవేగౌడను విగ్రహావిష్కరణకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించామన్నారు. కాగా గుజరాత్‌లో యూపీ, బీ హార్‌ రాష్ట్రాలకు చెందినవారిపై జరుగుతున్న దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. ఐదు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న గుజరాత్‌లో ఒక్కసారిగా ఇలా దాడులు జరగడం సరికాదన్నారు. గుజరాత్‌ నుంచి వలస వెళ్ళిన వారి శాతం 1శాతం కంటే తక్కువేనని వారంతా దసరా పండుగల అనంతరం గుజరాత్‌కు వస్తారన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. గుజరాత్‌లో నివసిస్తున్న అ న్ని రాష్ట్రాల, భాషల, మతాల ప్రజలకు పరిపూర్ణ రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com