తండ్రీకొడుకులుగా నాని!
- October 17, 2018

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ' జెర్సీ ' ! పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు. గౌతం తిన్నమూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం నిరాడంబరంగా జరిగాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ' కలను అందుకోవాలంటే ఆలస్యం చేయొద్దు ' అనే ట్యాగ్ లైన్ ఈ చిత్రానికి పెట్టామని, గురువారం నుంచి రెగ్యలర్ షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు.
ఇందులో నాని క్రికెటర్ గా నటించడమే గాక.. తండ్రీకొడుకులుగా కనిపించనున్నాడని తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్, రెబ్బా మోనికా జాన్ హీరోయిన్లుగా నటించనున్నారు. మలయాళం, తమిళంతో బాటు నాలుగు మూవీల్లో నటించిన మోనిక ఈ చిత్రంతో తెరంగేట్రం చేయబోతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత.. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. సత్యరాజ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







