తండ్రీకొడుకులుగా నాని!
- October 17, 2018నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ' జెర్సీ ' ! పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు. గౌతం తిన్నమూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం నిరాడంబరంగా జరిగాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ' కలను అందుకోవాలంటే ఆలస్యం చేయొద్దు ' అనే ట్యాగ్ లైన్ ఈ చిత్రానికి పెట్టామని, గురువారం నుంచి రెగ్యలర్ షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు.
ఇందులో నాని క్రికెటర్ గా నటించడమే గాక.. తండ్రీకొడుకులుగా కనిపించనున్నాడని తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్, రెబ్బా మోనికా జాన్ హీరోయిన్లుగా నటించనున్నారు. మలయాళం, తమిళంతో బాటు నాలుగు మూవీల్లో నటించిన మోనిక ఈ చిత్రంతో తెరంగేట్రం చేయబోతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత.. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. సత్యరాజ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం