వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం ఆవిష్కరణకు ఆహ్వానం
- October 17, 2018
బెంగళూరు: దేశ ఐక్యత కోసం ఎంతగానో ప రితపించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్తా విగ్రహాన్ని ఈనెల 31న జాతికి అంకితం చేయనున్నారు. ఈ విషయాన్ని గు జరాత్ విద్యుత్‌శాఖ మంత్రి సౌరభ్‌భాయ్ పటేల్ బెంగళూరులో మీడియాకు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరిస్తారన్నారు. గుజరాత్‌లోని న ర్మదా జిల్లా సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద 182 అడుగుల ఎత్తు కల్గిన ఈ భారీ విగ్రహాన్ని రోజూ 15వేలమంది పర్యాటకులు తిలకించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఈప్రాంతం అతి త్వరలోనే ప్రాధాన్యతను సంతరించుకోవడం ఖాయమన్నారు. పటేల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను ఆహ్వానిస్తున్నామన్నారు.
భిన్నత్వంలో ఏకత్వం కోసం పాటుపడిన ఉక్కుమనిషి పటేల్‌ను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని అయితే ప్రధాని మోదీ సాహసోపేతంగా విమర్శలకు సైతం వెరవకుండా ఏక్తా విగ్రహాన్ని గట్టి పట్టుతో పూర్తి చేశారన్నారు. దేశ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. రూ.3వేల కోట్ల ఖర్చుతో జాతీయ ఏక్తా ట్రస్టు ఈ విగ్రహాన్ని నిర్మించిందన్నారు. గుజరాత్‌కే చెందిన కర్ణాటక గవర్నర్ వాజుభాయ్‌వాలాను, ముఖ్యమంత్రి కుమారస్వామిని, మాజీ ప్రధాని దేవేగౌడను విగ్రహావిష్కరణకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించామన్నారు. కాగా గుజరాత్‌లో యూపీ, బీ హార్ రాష్ట్రాలకు చెందినవారిపై జరుగుతున్న దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. ఐదు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న గుజరాత్‌లో ఒక్కసారిగా ఇలా దాడులు జరగడం సరికాదన్నారు. గుజరాత్ నుంచి వలస వెళ్ళిన వారి శాతం 1శాతం కంటే తక్కువేనని వారంతా దసరా పండుగల అనంతరం గుజరాత్‌కు వస్తారన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. గుజరాత్‌లో నివసిస్తున్న అ న్ని రాష్ట్రాల, భాషల, మతాల ప్రజలకు పరిపూర్ణ రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







