కొహ్లీ అభ్యర్థనను అంగీకరించిన బీసీసీఐ
- October 17, 2018
ఢిల్లీ: టీమిండియా విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల భాగస్వాములను లేదా వారి ప్రియురాళ్లను అనుమతించాలని కొహ్లీ చేసిన అభ్యర్థనకు బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. దీర్ఘ కాలిక పర్యటనలు ఉన్న సమయంలో మొదటి పది రోజుల తర్వాత వెళ్లి పర్యటన ముగిసేవరకూ వారి భాగస్వాములు ఉండొచ్చని పాలకుల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట తమ జీవిత భాగస్వాములు, వ్యక్తిగత సిబ్బందిని రెండు వారాలపాటే అనుమతిస్తున్నారు. అయితే ఈ నిబంధనలను మార్చాలని.. విదేశీ పర్యటన పూర్తికాలం జీవితభాగస్వాములను తమతో అనుమతించాలని ఇటీవల కోహ్లీ బీసీసీఐని అభ్యర్థించిన విషయం తెలిసిందే. దీనిపై ఆటగాళ్ల అభిప్రాయం తీసుకునేందుకు కోచ్ రవిశాస్త్రి, కొహ్లీ, రోహిత్ శర్మను పాలకుల కమిటీ వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు కలిసి చర్చించింది. ఆటగాళ్ల వెంట జీవితభాగస్వాములను, ప్రియురాళ్లను అనుమతించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







