అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం: వృద్ధుడు, ఇద్దరు చిన్నారుల మృతి

అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం: వృద్ధుడు, ఇద్దరు చిన్నారుల మృతి

అజ్మన్‌లో జరిగిన ఓ అగ్ని ప్రమాదం ఓ వృద్ధుడిని, ఇద్దరు చిన్నారుల్ని బలిగొంది. అజ్మన్‌ సివిల్‌ డిఫెన్స్‌ సెంట్రల్‌ ఆపరేషన్‌ రూమ్‌కి ఈ ఘటనపై సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని ప్రారంభించారు. అల్‌ రషిదియా ప్రాంతంలోని 6 అంతస్తుల భవనంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్‌లు, ఫైర్‌ ఫైటర్స్‌ అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించాయి. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే పొగను ఎక్కువగా పీల్చేయడం, కాలిన గాయాల కారణంగా వారు ప్రాణాలు కోల్పోయారు. 

 

Back to Top