దొంగతనం కేసులో 10 ఏళ్ళ తర్వాత దొరికిన మెయిడ్‌

దొంగతనం కేసులో 10 ఏళ్ళ తర్వాత దొరికిన మెయిడ్‌

స్పాన్సరర్‌ ఇంట్లో బంగారు ఆభరణాల్ని దొంగిలించిన ఓ మెయిడ్‌, పదేళ్ళ తర్వాత పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్‌ చేసిన పోలీసులు, కోర్టు ముందుంచారు. యజమాని బెడ్రూమ్‌లోకి మెయిడ్‌ వెళ్ళి దొంగనతానికి పాల్పడటాన్ని యజమాని తనయుడు (11 ఏళ్ళు) చూశాడు. ఓ బ్యాగులో నగల్ని వుంచి, వాటిని బయటకు విసిరేసింది. ఆ తర్వాత ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మెయిడ్‌ రెసిడెన్సీ స్టేటస్‌ చెక్‌ చేసిన పోలీసులకు, ఆమె అబ్‌స్కాండింగ్‌లో వున్నట్లు తెలిసింది. ఆ దిశగా కూడా ఆమెపై కేసులు నమోదు చేశారు. షార్జా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. 

Back to Top