యూఏఈలో డెడ్లీ స్నేక్
- November 14, 2018యూఏఈ రెసిడెంట్స్, పెరుగుతున్న పాములతో ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మినా అల్ అరబ్లోని ఓ ఇంట్లో యూరోపియన్ జాతీయుడికి అతి ప్రమాదకరమైన సా స్కేల్డ్ వైపర్ స్నేక్ కన్పించింది. అదృష్టవశాత్తూ ఆ వ్యక్తి, తన స్నేహితుల సాయంతో వైపర్ కాటు నుంచి తప్పించుకున్నారు. రస్ అల్ ఖైమా యానిమల్ వెల్ఫేర్ సెంటర్కి సమాచారం ఇవ్వగా, సిబ్బంది వచ్చిన ఆ స్నేక్ని తమ వెంట తీసుకెళ్ళారు. రస్ అల్ ఖైమా యానిమల్ వెల్ఫేర్ సెంటర్ మెడికల్ మేనేజర్ డాక్టర్ ఛెంజెరాయ్ సిగాకె మాట్లాడుతూ, భూమ్మీద అత్యంత విషపూరితమైన పాముల్లో సా స్కేల్డ్ వైపర్ కూడా ఒకటని అన్నారు. అరబ్ దేశాలతోపాటు పాకిస్తాన్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ పాము ఆచూకీ కన్పిస్తుంటుంది. రాత్రి వేళల్లో ఈ పాము చాలా యాక్టివ్గా వుంటుంది. కొన్ని నెలల క్రాతం జుల్ఫార్ ఏరియాలో రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ ఓ పాముని పట్టుకుని చంపేయడం జరిగింది. పాముల విషయంలో అప్రమత్తంగా వుండాలనీ, పాముల ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారమివ్వాలని అధికారులు అంటున్నారు. సా స్కేల్డ్ వైఫర్స్ ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో వుంటాయి. ఇవి రెసిడెన్షియల్ ఏరియాలవైపు వెళుతుంటాయి. నీటి కోసం, ఆహారం కోసం జనవాసాల్లోకి వస్తుంటాయివి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!