స్కూల్ స్విమ్మింగ్ పూల్‌లో మునిగి చిన్నారి మృతి
- November 14, 2018
యూ.ఏ.ఈ :నాలుగేళ్ళ చిన్నారి, ఓ ప్రైవేట్ స్కూల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆపరేషన్స్ రూమ్‌కి ఉదయం 10.30 నిమిషాల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందింది. పోలీస్ మరియు అంబులెన్స్ వెహికిల్స్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. నీట మునిగిన చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అల్ కాసిమి ఆసుపత్రి వైద్యులు, చిన్నారిని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్నారి ఎలా నీట మునిగాడన్నదానిపై స్కూల్ యాజమాన్యం నుంచి సరైన సమాచారం అందలేదు. పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







