స్కూల్ స్విమ్మింగ్ పూల్‌లో మునిగి చిన్నారి మృతి
- November 14, 2018యూ.ఏ.ఈ :నాలుగేళ్ళ చిన్నారి, ఓ ప్రైవేట్ స్కూల్లోని స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆపరేషన్స్ రూమ్‌కి ఉదయం 10.30 నిమిషాల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందింది. పోలీస్ మరియు అంబులెన్స్ వెహికిల్స్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. నీట మునిగిన చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అల్ కాసిమి ఆసుపత్రి వైద్యులు, చిన్నారిని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్నారి ఎలా నీట మునిగాడన్నదానిపై స్కూల్ యాజమాన్యం నుంచి సరైన సమాచారం అందలేదు. పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..