పింక్ డైమండ్ @ రూ.360 కోట్లు
- November 14, 2018
స్విట్జర్లాండ్:అత్యంత అరుదైన, ఎంతో అందమైన గులాబీ రంగు వజ్రం పింక్ లెగసీ రికార్డు సృష్టించింది. వేలంలో ఏకంగా 50మిలియన్ డాలర్లు పలికి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన వేలంలో పింక్ డైమండ్ సుమారు 360కోట్లు పలికింది. అమెరికాకు చెందిన హ్యారీ విన్‌స్టన్ సంస్థ దక్కించుకుంది. వెంటనే వజ్రానికి విన్‌స్టన్ పింక్ లెగసీ అని పేరు మార్చారు.
పింక్ లెగసీ 19 కేరట్ల బరువుంటుంది. వేలంలో ఈ డైమండ్ ఒక్కో క్యారెట్‌కు 2.6 మిలియన్ డాలర్లు పలికిందని క్రిస్టీస్ సంస్థ వెల్లడించింది. ఈ తరహా వజ్రాలలో అత్యధిక ధర పలికిన వజ్రంగా పింక్ లెగసీ రికార్డు సృష్టించిందని క్రిస్టీస్ పేర్కొంది. పింక్ డైమండ్లలో గతంలో ఎన్నడూ క్యారెట్‌కు ఇంత ధర పలకలేదని క్రిస్టీస్ తెలిపింది.
పింక్ లెగసీ డైమండ్ దక్షిణాఫ్రికాకు చెందిన బిలియనీర్ల కుటుంబమైన ఓపెన్ హైమీర్ కుటుంబానికి చెందినది. దాదాపు శతాబ్దం క్రితం ఇది దక్షిణాఫ్రికా గనుల్లో లభ్యమైంది. 1920ల్లో ఆ వజ్రానికి సానపెట్టి మెరుగులు దిద్దారు. ఇది చాలా అద్భుతమైన వజ్రమని, 10 క్యారెట్ల కంటే ఎక్కువ బరువు ఉండే పింక్ డైమండ్లు చాలా అరుదు అని క్రిస్టీస్ పేర్కొంది.
గత ఏడాది నవంబరులో హాంకాంగ్‌లో జరిగిన వేలంలో 15క్యారెట్ల బరువైన పింక్ డైమండ్ 32.5మిలియన్ డాలర్లు పలికింది. ఆ రికార్డును పింక్ లెగసీ డైమండ్ అధిగమించింది. అయితే వజ్రాన్ని ఇప్పుడు అమ్మిన వారెవరు అనే విషయాన్ని మాత్రం క్రిస్టీస్ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి