దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ మరో వారం పొడిగింపు

దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ మరో వారం పొడిగింపు

దుబాయ్‌ ఫెస్టివల్స్‌ అండ్‌ రిటెయిల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ - ఈ ఏడాది దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ని అదనంగా మరో వారం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. దుబాయ్‌ టూరిజం ఏజెన్సీ అయిన దుబాయ్‌ ఫెస్టివల్స్‌ అండ్‌ రిటెయిల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (డిఎఫ్‌ఆర్‌ఇ) ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తుంది. 24 వ ఎడిషన్‌ని అదనంగా మరో వారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదనపు పొడిగింపుతో షాపింగ్‌ ప్రియులకు మరింత వెసులుబాటు కలుగుతుందని వారంటున్నారు. ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌ బోల్డన్ని ఈవెంట్స్‌కి వేదికగా నిలుస్తుంటుంది. డిఎఫ్‌ఆర్‌ఇ సిఇఓ అహ్మద్‌ అల్‌ ఖాజా మాట్లాడుతూ, రిటెయిల్‌ క్యాలెండర్‌లో దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ని మోస్ట్‌ పాపులర్‌ ఫెస్టివల్‌గా అభివర్ణించారు. ప్రతి యేడాది అంచనాలకు మించి షాపింగ్‌ ప్రియులు, దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌లో సందడి చేస్తున్నారని తెలిపారు.

Back to Top