దంతాలపై పచ్చని గార పోవట్లేదా...
- November 21, 2018
అందమైన ముఖానికి చక్కని చిరునవ్వు ఓ ఆభరణం వంటింది. అయితే, మనసారా నవ్వాలంటే పలువరుస బాగుండాలి. ఆ పళ్ళు పచ్చగా ఉంటే హాయిగా నవ్వలేరు కూడా. పైగా, ఆ పచ్చని గార ఎంత దాచుకుందామన్నా దాగనిది. అలాంటిగారను పోగొట్టేందుకు చాలామంది రెండు పూటలా బ్రష్ చేస్తుంటారు. అయినప్పటికీ పచ్చని గార దంతాలను వదిలిపోదు.
అయితే, అంగట్లో దొరికే టూత్ పేస్టుల కంటే ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం కనుకొనవచ్చు. ఆ రెండు పదార్థాల్లో ఒకటి బేకింగ్ సోడా. రెండోది నిమ్మరసం.
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఓ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. దానికి సగం చెక్క నిమ్మరసం పిండాలి. ఈ రెంటిని బాగా కలపాలి. వేలితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దంతాలపై రుద్దాలి. ఓ మూడు నిమిషాలు బ్రష్ చేసినట్టుగా వేలితో రుద్దాలి. తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించాలి. అంతే.. మీ పచ్చని దంతాలు తెల్లగా మెరిసిపోవడం ఖాయం.
గుప్పెడు తులసి ఆకులను తీసుకుని నీడలో ఆరబెట్టాలి. ఆరిన తర్వాత వాటిని మెత్తగా పొడిచేసుకోవాలి. ఈ పొడితో పళ్లు రుద్దుకుంటే కూడా పచ్చని దంతాలు తెల్లగా మారే అవకాశం ఉంది. రోజూ వాడే పేస్టుకి ఈ తులసి పౌడర్ జత చేసినా మంచిదే. ఇతర సమస్యలకు కూడా తులసి పౌడర్ అద్భుతంగా పనిచేస్తుంది.
ఉప్పులో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి దానితో పళ్లు తోముకున్నా పసుపు రంగు మీద ప్రభావం చూపిస్తుంది. లవంగాలను పొడి చేసి పేస్టుతో కలిపి రుద్దుకుంటే కూడా ఫలితం ఉంటుంది. దీనివల్ల పళ్లు ధృఢంగా కూడా తయారవుతాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







