దంతాలపై పచ్చని గార పోవట్లేదా...
- November 21, 2018అందమైన ముఖానికి చక్కని చిరునవ్వు ఓ ఆభరణం వంటింది. అయితే, మనసారా నవ్వాలంటే పలువరుస బాగుండాలి. ఆ పళ్ళు పచ్చగా ఉంటే హాయిగా నవ్వలేరు కూడా. పైగా, ఆ పచ్చని గార ఎంత దాచుకుందామన్నా దాగనిది. అలాంటిగారను పోగొట్టేందుకు చాలామంది రెండు పూటలా బ్రష్ చేస్తుంటారు. అయినప్పటికీ పచ్చని గార దంతాలను వదిలిపోదు.
అయితే, అంగట్లో దొరికే టూత్ పేస్టుల కంటే ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం కనుకొనవచ్చు. ఆ రెండు పదార్థాల్లో ఒకటి బేకింగ్ సోడా. రెండోది నిమ్మరసం.
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఓ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. దానికి సగం చెక్క నిమ్మరసం పిండాలి. ఈ రెంటిని బాగా కలపాలి. వేలితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దంతాలపై రుద్దాలి. ఓ మూడు నిమిషాలు బ్రష్ చేసినట్టుగా వేలితో రుద్దాలి. తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించాలి. అంతే.. మీ పచ్చని దంతాలు తెల్లగా మెరిసిపోవడం ఖాయం.
గుప్పెడు తులసి ఆకులను తీసుకుని నీడలో ఆరబెట్టాలి. ఆరిన తర్వాత వాటిని మెత్తగా పొడిచేసుకోవాలి. ఈ పొడితో పళ్లు రుద్దుకుంటే కూడా పచ్చని దంతాలు తెల్లగా మారే అవకాశం ఉంది. రోజూ వాడే పేస్టుకి ఈ తులసి పౌడర్ జత చేసినా మంచిదే. ఇతర సమస్యలకు కూడా తులసి పౌడర్ అద్భుతంగా పనిచేస్తుంది.
ఉప్పులో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి దానితో పళ్లు తోముకున్నా పసుపు రంగు మీద ప్రభావం చూపిస్తుంది. లవంగాలను పొడి చేసి పేస్టుతో కలిపి రుద్దుకుంటే కూడా ఫలితం ఉంటుంది. దీనివల్ల పళ్లు ధృఢంగా కూడా తయారవుతాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు