పాన్ కార్డు రూల్స్ సడలించిన సీబీడీటీ

- November 21, 2018 , by Maagulf
పాన్ కార్డు రూల్స్ సడలించిన సీబీడీటీ

ఢిల్లీ: పర్మనెంట్ అకౌంట్ నంబర్ - పాన్ కార్డులో తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొవాలనే నిబంధన ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో తండ్రి పేరు రాయాల్సిన అవసరం లేదంటూ సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి) అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు నిబంధనలు సడలిస్తూ మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే తల్లి మాత్రమే ఉండి తండ్రి లేనివారికి మాత్రమే ఈ నయా రూల్ వర్తిస్తుంది.

తండ్రి చనిపోయిన పక్షంలో లేదంటే తమను తండ్రి వదిలిపెట్టి వెళ్లిపోయిన వారికి మాత్రమే ఈ నిబంధనను సడలించారు. వీరు కచ్చితంగా తండ్రి పేరును అప్లికేషన్ లో నింపాల్సిన అవసరముండదు. డిసెంబర్ 5 నుంచి కొత్తగా మార్చిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఫైనాన్సియల్ ఇయర్ లో రెండున్నర లక్షల రూపాయలకు మించి ట్రాన్సక్షన్స్ జరిపే సంస్థలు, కంపెనీలు ఇకపై కచ్చితంగా పాన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోవాలని తెలిపింది. మే 31 వరకు గడువు ఇస్తూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com