హైటెక్స్‌లో ఘనంగా ముగిసిన ఆల్‌ లైట్స్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ - ఎఎల్‌ఐఐఎఫ్‌ఎఫ్

హైటెక్స్‌లో ఘనంగా ముగిసిన ఆల్‌ లైట్స్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ - ఎఎల్‌ఐఐఎఫ్‌ఎఫ్

ఆల్‌ లైట్స్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ హైద్రాబాద్‌లో ఘనంగా ముగిసింది. డిసెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 5 వరకు జరిగిన ఈ ఫిలిం ఫెస్టివల్‌లో అనేక ఈవెంట్స్‌ జరిగాయి. సినీ పరి&శ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు, ఇండియాలోని వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ ఫెస్టివల్‌కి హాజరై, పలు ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. క్లోజింగ్‌ సెర్మనీలో భాగంగా ప్రతిష్టాత్మక గోల్డెన్‌ ఫ్రేమ్‌ అవార్డ్స్‌ బహూకరణ జరిగింది. ఔత్సాహికులు, టాలెంట్‌ వున్నవారికి ఈ ఫెస్టివల్‌ ఓ ప్రత్యేకమైన వేదికగా నిలిచింది. షార్ట్‌ ఫిలిం సహా పలు విభాగాల్లో విజేతలకు బహుమతులు అందించారు. సినిమాల ప్రదర్శన, ఫ్యాషన్‌ షో, సినిమాకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలు.. ఇలా చాలా ఈవెంట్స్‌కి ఈ ఆల్‌ లైట్స్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ మంచి వేదికగా నిలిచిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 

Back to Top