5,000 ఫేక్ సోషల్ మీడియా అక్కౌంట్స్ బ్లాక్‌డ్
- December 06, 2018
స్మార్ట్ సిస్టమ్ ద్వారా యూఏఈలో 5,000 సోషల్ మీడియా అకౌంట్స్‌ని బ్లాక్ చేసినట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించింది. ఆన్‌లైన్ ఫ్రాడ్‌కి వ్యతిరేకంగా దుబాయ్ పోలీస్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఫేక్ అకౌంట్స్ బ్లాకింగ్‌పై వివరాల్ని వెల్లడించారు జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ జమాల్ సలెమ్ అల్ జలాఫ్. ఈ క్రమంలో ఎటిసలాట్ సంస్థతో కలిసి పనిచేశామని ఆయన వివరించారు. ఎటిజలాట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ మొహమ్మద్ అల్ జరౌని మాట్లాడుతూ, 2017 సెకెండాఫ్ నుంచి ఇప్పటివరకు 5,000 ఫేక్ అకౌంట్స్‌ని బ్లాక్ చేశామని చెప్పారు. ఆన్‌లైన్ ఫ్రాడ్‌పై చేపడుతున్న అవగాహనా కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఆయన అన్నారు. 'బివేర్ ఆఫ్ ఫాల్స్ అకౌంట్స్' పేరుతో దుబాయ్ పోలీస్, అవేర్‌నెస్ డ్రైవ్ చేపట్టింది. సైబర్ క్రిమినల్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌ని విరివిగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







