ఫేస్బుక్ మెసేంజర్ నుంచి అదిరిపోయే ఫీచర్
- January 05, 2019సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్బుక్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్బుక్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ ఏడాది మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ల ప్రకారం ఫేస్బుక్ మెసెంజర్లో త్వరలో డార్క్ మోడ్ పేరిట ఓ కొత్త ఫీచర్ లభ్యం కానుంది. అయితే పలు ఎంపిక చేసిన దేశాల యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ మొదట అందుబాటులోకి వస్తుంది.
జనవరిలో ఆకాశంలో మరో అద్భుతం జరగబోతోంది.
అక్టోబర్‌లోనే ఫేస్బుక్ ప్రకటన
కాగా గతేడాది అక్టోబర్‌లోనే ఫేస్బుక్ ఈ ఫీచర్ గురించి ప్రకటన చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కాగా ప్రస్తుతం ఫేస్బుక్ ఈ ఫీచర్‌ను అంతర్గతంగా పరీక్షిస్తున్నట్లు సమాచారం.
కాంతి అంతగా లేని ప్రదేశాల్లో
అది పూర్తి అయిన అనంతరం యూజర్లకు పూర్తి స్థాయిలో ఈ ఫీచర్ అప్డేట్ను ఇస్తారు. డార్క్ మోడ్ ఫీచర్ వల్ల రాత్రి పూట, కాంతి అంతగా లేని ప్రదేశాల్లో యూజర్లు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను మరింత సౌకర్యవంతంగా చూడవచ్చు.
కళ్లు సురక్షితం
దీని వల్ల తక్కువ కాంతి వెలువడుతుంది. కళ్లు సురక్షితంగా ఉంటాయి.అయితే ఇక ఫేస్బుక్ ఈ ఫీచర్‌ను మెసెంజర్లో ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనేదానిపై ఎటువంటి క్లారిటీ లేదు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక