అరుదైన రికార్డు సాధించిన '2.ఓ' సినిమా
- January 05, 2019
ఒకప్పుడు తమ అభిమాన కథానాయకుడి సినిమా చూసేందుకు.. జనం థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. కానీ.. పెరిగిన టెక్నాలజీతో ఇప్పుడు థియేటర్ల దగ్గర కంటే ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లకు కాంపిటేషన్ పెరిగింది. సినిమా విడుదలకు మూడు, నాలుగు రోజుల ముందే నెట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే పద్ధతి అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఇండియాలో సినిమా టిక్కెట్లు విక్రయించే ఆన్‌లైన్ పోర్టల్స్‌లో బుక్ మై షో ఒకటి. అంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే 2018 సంవత్సరంలో సినిమా టిక్కెట్ల బుకింగ్ పెరిగినట్టు ఈ సంస్థ ప్రకటించింది. పోయినేడాది ఈ సంస్థ పలు భాషలకు సంబంధించి ఏకంగా 1780 సినిమాల టిక్కెట్లను విక్రయించిందట. అన్ని సినిమాల్లోకెల్లా అత్యధికంగా టికెట్లు అమ్ముడు పోయిన సినిమా '2.ఓ' అని సదరు సంస్థ ప్రకటించింది. '2.ఓ' చిత్రం బుకింగ్స్ ఓపెన్ చేయగానే అన్ని భాషలకు కలిపి సెకనుకు 16 టికెట్ల చొప్పున అమ్ముడు పోయి సరికొత్త రికార్డు సృష్టించిందట.
2018వ సంవత్సరానికిగానూ బుక్ మై షో టిక్కెట్ల విక్రయాల్లో '2.0' తర్వాత రెండవ స్థానంలో 'పద్మావత్' చిత్రం నిలిచింది. ఇక గత ఏడాది ఈ సంస్థ విక్రయించిన టిక్కెట్లలో మొదటి స్థానంలో హిందీ చిత్రాలు నిలవగా రెండో స్థానాన్ని తెలుగు చిత్రాలు ఆక్రమించాయట. ఆ తర్వాత మూడవ స్థానంలో ఇంగ్లీష్ సినిమాలున్నాయి. మొత్తంమీద 2018వ సంవత్సరానికి బుక్ మై షో పోర్టల్‌లో '2.ఓ' టాప్ ప్లేసులో నిలవగా 2019లో ఏ చిత్రం ఆ అవకాశాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..