దానిమ్మ గింజలను తింటే..
- January 19, 2019దానిమ్మ గింజలు రోజూ ఒక కప్పు తీసుకుంటే ఇట్టే సులభంగా బరువు తగ్గుతారని న్యూట్రీషియన్లు అంటున్నారు. ఇంకా ఆహార పదార్థాల తయారీకి ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిదని వారు చెప్తున్నారు. ఈ నూనెలోని మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొల్రెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను కాపాడతాయి. కాబట్టి బరువు పెరిగే సమస్యే వుండదు.
అదేవిధంగా చేపలను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా ఒబిసిటీ సమస్య వుండదు. చేపల్లో కొవ్వు ఉండదు. అందుకే క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి మటన్, చికెన్ జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే.. బరువు పెరగడాన్ని నిరోధించుకోవచ్చు.
వీటితో పాటు రోజువారి డైట్లో పచ్చని కాయగూరలు, ఆకుకూరలను తీసుకుంటూ వుండాలి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కాబట్టి ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే కూరగాయలను ఎక్కువగా తింటే బరువు పెరగరు. వెజిటబుల్ సూప్స్ వల్ల కూడా క్యాలరీలు పెద్దగా పెరగవు. పైగా భోజనం వెజ్ సూప్ తీసుకుంటే ఆహారాన్ని మితంగా తీసుకునే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు