ఆసక్తిని రేకెత్తిస్తోన్న రాజశేఖర్ కల్కి టీజర్
- February 04, 2019రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమా రూపొందుతోంది. యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ నిర్మాత సి.కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజున రాజశేఖర్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు.
యాక్షన్ సీన్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. వర్షంలో రాజశేఖర్ పై ఒక గ్యాంగ్ చేసే దాడిని ఈ టీజర్లో చూపించారు. రాజశేఖర్ సినిమా నుంచి ఆడియన్స్ ఆశించే యాక్షన్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజశేఖర్ సరసన కథానాయికలుగా ఆదా శర్మ .. నందిత శ్వేత కనిపించనున్నారు. నిన్నమొన్నటి వరకూ అభిమానులతో యాంగ్రీ యంగ్ మేన్ అంటూ పిలిపించుకున్న రాజశేఖర్, ఈ సినిమాతో యాంగ్రీ స్టార్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.
తాజా వార్తలు
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్‌ను కలిసిన భారత రాయబారి
- ఖతార్‌లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..