హైదరాబాద్:ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్

- February 04, 2019 , by Maagulf
హైదరాబాద్:ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్

గ్రేట‌ర్ ఆర్టీసీ బస్సలో ప్రయాణించే వారికి టీఆర్టీసీ శుభవార్త చేప్పింది. ఇన్నాళ్ళు డిజిల్ బస్సుల్లో ప్రయాణిస్తూ కాలుష్యంతో సతమవుతున్న వారికి త్వరలో ప్రారంభించబోయే ఎలక్ట్రిక్ బస్సులు కాస్త ఊరట ఇవ్వనున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ రోడ్ల‌పై ఎల‌క్ట్రిక్ బ‌స్ ప‌రుగులు పెట్టేందుకు ముహూర్తం ఖ‌రారైంది. రేపు సాయంత్రం నుండి ఈ బ‌స్సులు ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి రానున్నాయి. కేంధ్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆర్థిక సాయంతో రోడెక్క‌నున్న ఈ స‌ర్వీసులు ప్రయోగాత్మ‌కంగా న‌గ‌రంలో తిప్పేందుకు అదికారులు ఏర్పాట్లు చేసారు. మొద‌టి విడ‌త‌లో 40బ‌స్సుల‌ను వివిద రూట్ల గుండా ఏయిర్ పోర్టు ప్ర‌యాణికుల కోసం వినియోగించ‌నున్నారు. ప్ర‌యాణికుల‌తో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ల‌గేజీని తీసుకు వెళ్ళేందుకు వీలుగా ఈ బ‌స్సులను డిజైన్ చేసిన‌ట్టు అదికారులు చెబుతున్నారు…

- ADVT -

 
కాలుష్య నియంత్ర‌ణ‌తో పాటు సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణం కోసం కేంధ్ర ప్ర‌భుత్వం మెట్రో న‌గ‌రాల్లో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణియించింది. మోద‌ట దేశ వ్యాప్తంగా ఉన్న 11 మెట్రో న‌గ‌రాల్లో ఈ బ‌స్స‌లను న‌డిపించాల‌ని సూచించింది కేంధ్రం. కొన్ని న‌గ‌రాల్లో ప్ర‌భుత్వ భాగ‌స్వ‌మ్యంతో ఈ బస్సుల‌ను రోడ్ల‌పైకి తెస్తుండ‌గా హైద‌రాబాద్ లో ఈ స‌ర్వీసుల‌ను ప్రైవేటు సంస్థ‌ల‌కు అప్ప‌గించింది. అద్దె ప్రాతిప‌దిక‌న ఈ బ‌స్సుల‌ను తిప్ప‌నుంది ఆర్టీసీ. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల తిప్పేందుకు నాలుగు సంస్థ‌లు పోటీ ప‌డ‌గా అతి త‌క్కువ అద్దెకు న‌డిపేందుకు అంగీక‌రించిన సంస్థ‌కు 40బ‌స్సులు కేటాయించారు. ఇప్ప‌టికే ఈ బస్సుల రిజిస్ట్రేష‌న్ ను పూర్తిచేసుకుని రోడ్ల‌పైకి వ‌చ్చేందుకు సిద్దంగా ఉండ‌గా … ప్ర‌భుత్వ‌ ఆదేశాల కోసం అదికారులు ఎదురుచూస్తున్నారు. ప్ర‌భుత్వం నుండి లైన్ క్లియ‌ర్ కావ‌డంతో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను రేపటి నుండే రోడ్ల‌పైకి తెచ్చేందుకు గ్రేట‌ర్ ఆర్టీసీ స‌న్నద్దం అవుతోంది…

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com